5జీ టెక్నాలజీ ట్రయల్స్ విషయంలో కేంద్రం చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహణ చైనా కంపెనీలను మినహాయిస్తు కేవలం భారతీయటెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి మాత్రమే అనుమతినిచ్చింది. ఇక ఇప్పటికే రిలయన్స్ జియో పూర్తి స్వదేశీ టెక్నాలజీ తో 5g ని ప్రొవైడ్ చేస్తుంది. గత 4జీతో పోలిస్తే 10 రెట్లు వేగంగా 5g డేటా డౌన్లోడ్ అవుతుంది. కేవలం స్మార్ట్ ఫోన్స్ కోసమే కాకుండా మిగతా రంగాల్లో కూడా సాంకేతిక విజ్ఞానం ఉపయోగిస్తు విప్లవాత్మక మార్పులు సృష్టించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. ఆత్మనిర్భర్ లో భాగంగానే చైనాను 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. కాగా ఇది చైనాకు మరియు దాని అనుసంధాన కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ.

మరింత సమాచారం తెలుసుకోండి: