కొద్ది గంటల్లో తేలనున్న భవితవ్యం

భారత దేశం యావత్తూ ఎదురు చూస్తున్న భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆరంభమైంది. ఇక్కడ నుంచి తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టి.ఎం.సి) అభ్యర్థిగా   ప శ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండడంతో యావత్ భారత దేశం ఈ వైపు దృష్టి సారించింది. 2021 లో ఆ రాష్ట్రంలో జరిగిన  శాసన సభ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు.  టి.ఎం.పి శాసన సభ్యులు తమ శాసన సభాపక్ష నేతగా మమతా బెనర్జీని ఎన్నుకోవడంతో ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పదవి చేపట్టిన ఆరు నెలలలోపు చట్ట సభకు హాజరు కావాలన్నది  భారత రాజ్యాంగంలోని నిబంధన.  దీంతో ఆమె కోసం భవనీపూర్ నుంచి ఎం.ఎల్.ఏ గా ఎన్నికైన  చటోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30వ తేదీ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించింది.   మమతా బనర్జీకి పోటీగా భారతీయ జనతా పార్టీ స్థానిక న్యాయవాది ప్రియాంకను బరిలో దించింది.  సి.పి.ఎం కూడా తన అభ్యర్థిని ఎన్నికల బరిలో ని లిపింది. అన్ని పార్టీలు ఈ  ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడాయి. తమ చతురంగ  బలాలను మొహరించాయి. టక్కుటమార విద్యలను ప్రదర్శించాయి. ఇన్ని చేసినా దాదాపు సగం మంది ఓటర్లు  పోలింగ్ కు దూరంగానే ఉన్నారు.  21 రౌండ్ల కౌంటింగ్ తరువాత ఫలితం తేలనుంది. కడపటి వార్తలు అందే సరికి మమతా బెనర్జీ కొద్ది పాటి అధిక్యంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: