సరైన బొగ్గు నిల్వలు లేక రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం దాకా గగ్గోలు పెట్టాయి. తమకు తగినంత  కరెంటు సరఫరా లేదని వాపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా ఈ సమస్య లేకపోలేదు. తగిన కరెంటు ఉత్పత్తి సామర్త్యం ఉన్నా తమకు తగినంత బొగ్గు నిల్వలు మరియు తోలకాలు లేకపోవడంతో కరెంటు కష్టాలు తప్పేటట్లు వాపోయారు. అదేవిధంగా తమకు రావలసిన ఒప్పంద కరెంటు కూడా తగు సమయం లో రాలేదని మండి పడ్డాయి కూడా. ఈ విద్యుత్ సంక్షోభం పై కేంద్రం నుండి అమితే షా బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.



 తాజాగా బొగ్గు నిల్వలపై ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం . ప్రస్తుత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 7.2  మిల్లియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా . కోల్ ఇండియా దగ్గర 40 మిల్లియన్ టన్నులవరకు బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలిపింది. బొగ్గు నిల్వ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయబోతున్నట్లు కేంద్రం తెలిపింది. విద్యుత్ సంక్షోభం పై రాష్ట్రాలు ఇబ్బంది పడవద్దని ఈ సందర్భంగా తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: