అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో గడచిన 24 గంటల్లో 3,176 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దాదాపు 9 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతూ ఉండటంతో ట్రంప్ సర్కార్ కరోనాను కట్టడి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 
 
అమెరికాలో నిన్న ఒక్కరోజే 30,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 85,000 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 49,769 మంది మృతి చెందారు. న్యూయార్క్ లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. న్యూజెర్సీ, మాసాచుసెట్స్, కాలిఫోర్నియా ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
ఇప్పటివరకు 2.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా 44 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రజలకు ట్రంప్ సర్కార్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: