ప్రస్తుతం భారతీయ సంస్కృతి ప్రపంచం అంతటా వ్యాప్తి చెందుతోంది. యోగా, ఆయుర్వేదంలను ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి. మన దేశ సంస్కృతి మూలాలకు సంబంధించిన వాటిలో వేదాలు ఒకటి. వేదాలపై మన దేశంలోని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం వేదాలు ఎప్పుడు పుట్టాయి అనే ప్రశ్న వినిపిస్తోంది. వేదం ఎలా పుట్టింది...? ఎప్పుడు పుట్టింది...? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. 
 
హేతువాదులు వేదాలు క్రీస్తు పూర్వం 7,000 ఏళ్ల క్రితం వేదాలు పుట్టాయని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ బర్గ్ లో అధ్యాపకునిగా పని చేసే, సంస్కృత భాషలో అపారమైన జ్ఞానం కలిగిన ప్రొఫెసర్ కీర్త్ వేదాల వయస్సు నిర్ధారించడానికి ఎన్నో పరిశోధనలు చేసి వేదాలు క్రీస్తు పూర్వం 1200 నుంచి 2000 మధ్య కాలంలో సృశించబడినదని తేల్చారు. 
 
మరికొందరు క్రీస్తు పూర్వం 2 వేల సంవత్సరాల తర్వాత అని, మరికొందరు 6,000 సంవత్సరాల తర్వాత అని చెబుతున్నారు. ప్రస్తుతం వేదాలు పుట్టాయనే ప్రశ్న కంటే ఆ వేదాల సారాంశం చర్చించుకోవడం మంచిది. వేదాలలో మనం నిత్యం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలను తెలుసుకుంటే మన జీవితాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: