క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి యడ్యూర‌ప్ప రాజీనామా వెనుక ప్రత్యేక కారణాలు లేవని తేలింది. కేంద్ర పెద్దలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామాకు సిద్ధ‌మ‌య్యార‌ని బీజేపీ ఎంపీ శ్రీనివాసప్రసాద్ ప్ర‌క‌టించారు. ఈయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. అధిష్టానం, యడ్యూర‌ప్ప‌ల మధ్య ఒప్పందం గ‌తంలోనే కుదిరింద‌ని, ఆ మేర‌కే ఆయ‌న రాజీనామా చేస్తున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూల్చి బీజేపీ ప్రభుత్వం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలో ఇది జ‌రిగింద‌న్నారు. 75ఏళ్ళు పైబడిన వారికి బీజేపీలో కీలక పదవులు ఇవ్వ‌ర‌ని, ఒప్పందానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా రెండేళ్ళ ప‌ద‌వీకాలం ముగిసే రోజునే య‌డ్యూర‌ప్ప రాజీనామా చేస్తున్నారని శ్రీ‌నివాస‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆయ‌న్ను ఢిల్లీకి పిలిపించ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఏదీ లేద‌ని, గ‌తంలో కుదిరిన ఒప్పందం మేర‌కు రాజీనామా చేయాల‌నే అంశాన్ని గుర్తుచేయ‌డానికే పిలిచార‌ని, అందుకు అనుగుణంగా ఆయ‌న కూడా సిద్ధ‌ప‌డ్డార‌న్నారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆధ్వ‌ర్యంలో క‌ర్ణాట‌క‌లో ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి ముఖ్య‌మంత్రులు క‌లిసిరావ‌డంలేద‌నే సెంటిమెంటు బ‌ల‌ప‌డుతోంది. మొద‌టి నుంచి క‌ర్ణాట‌క‌లో బీజేపీ త‌ర‌ఫున ఏ వ్య‌క్తి కూడా పూర్తికాలం ప‌ద‌విలో కొన‌సాగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag