డ్రగ్స్‌ కేసులో ఈ నెల మూడోతేదీన బాలీవుడ్ క‌థానాయ‌కుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్టు అయిన సంగ‌తి విష‌యం తెలిసిందే. ఆర్య‌న్ ఖాన్ బెయిల్‌పై గ‌తంలో విచార‌ణ జ‌ర‌గ్గా షారుక్‌కు నిరాశే మిగిలింది. ఈరోజు మ‌ళ్లీ బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 23 సంవ‌త్స‌రాల ఖాన్ త‌ర‌పున మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ రంగంలోకి దిగారు. రోహ‌త్గీకి ముందు వేరే క్రిమిన‌ల్ న్యాయ‌వాది వాదించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ బెయిల్ రాక‌పోవ‌డంతో ఈసారి షారుఖ్ సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్‌ను ఆశ్ర‌యించారు. ముంబ‌యిలోని ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉన్న ఆర్య‌న్ ఖాన్‌ బెయిల్ పిటిష‌న్‌ను ఇప్ప‌టికే కోర్టు రెండు సార్లు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ను విడుదల చేయడానికి అతని తండ్రి బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్‌ వాంఖడేతో పాటు మరో ఇద్దరు రూ.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిల్ ఈ లంచం గురించి ఆరోపించారు. వీటిని  ఎన్సీబీ ఖండించింది. ఎన్‌సీబీపై దుష్ప్రచారం చేయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నార‌ని అధికారులు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: