గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు 10 పైసలు, 15 పైసలు తగ్గుతూ ఇప్పటికి ఏకంగా 3 రూపాయిలు తగ్గించాయి. చెప్పాలంటే ఇవి ఆల్రెడీ అన్యాయంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలే అన్యాయంగా తగ్గుతూ వస్తున్నాయి లెండి. అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి అనే చెప్పాలి.. 

 

ఈ న్యూస్ వాహనదారులకు సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. అన్యాయంగా అయినా న్యాయంగా అయినా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను అయితే భారీగానే తగ్గింది. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. 

 

అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు శనివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 6 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 6 పైసలు తగ్గుదలతో రూ. 77.85కు చేరగా, డీజల్ ధర 5 పైసలు తగ్గుదలతో 72.22 రూపాయలకు చేరింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. ఇది వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: