వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి  కొంత మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే తక్కువ వడ్డీతో రుణాలను తీసుకోవాలని అనుకుంటారు. కానీ డబ్బు అవసరం అలాంటిది కాబట్టి ఏదోక బ్యాంకులో రుణాలను పొందుతున్నారు. వారు వేసే అధిక వడ్డీలకు బలవుతున్నారు.. అయితే ఇప్పుడు రుణాలను పొందాలనుకునే వారు ఒకసారి ఇవి చూడండి. ప్రస్తుతం దేశవ్యాప్తం గా పండుగ సీజన్ మొదలైంది.. ప్రజలను ఆకట్టుకోవడానికి బ్యాంకులు కూడా రుణాలను అతి తక్కువ వడ్డీకే ఇస్తున్నారు.



ఏ బ్యాంకు లో పడితే ఆ బ్యాంకు లో లోన్ తీసుకుంటే భారీ నష్టాన్ని చవి చూడాలి. అలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలి.. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం..


1.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. వడ్డీ రేటు - 8.95

2 . పంజాబ్ నేషనల్ బ్యాంక్ .. వడ్డీ రేట్లు - 8.95

3. యూనియన్ బ్యాంక్ .. వడ్డీ రేటు - 8.9

4. ఇండియన్ బ్యాంక్ .. వడ్డీ రేటు - 9.5

5. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ..వడ్డీ రేటు - 9.6

6. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో ..  వడ్డీ రేటు - 9.7

7.యూకో బ్యాంక్‌లో .. వడ్డీ రేటు - 10.05

8. బ్యాంక్ ఆఫ్ బరోడా .. వడ్డీ రేటు - 10.25

9.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ .. వడ్డీ రేటు - 10.75

10. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ .. వడ్డీ రేటు - 10.75


ఈ బ్యాంకులలో మాత్రం వడ్డీ రేట్లు మిగిలిన బ్యాంకుల తో పోలిస్తే కాస్త తక్కువ అనే చెప్పాలి.. ఈ బ్యాంకుల లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువ పడుతుంది... తక్కువ వడ్డీ లో ఎక్కువ రుణాలను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: