ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పెద్ద పెద్ద కొండలు ఉన్న ప్రాంతాల గుండా ఉండే రహదారిలో ప్రయాణించేటప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణంలో కొండ చరియలు విరిగిపడి ప్రాణాలు తీస్తాయి అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా ఎప్పుడైనా కొండ చరియలు విరిగిపడిన ప్రమాదం జరిగింది అంటే చాలు ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.



 ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని బనిహళ్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కొండ చరియలు విరిగిపడిన తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు అని చెప్పాలి. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోని ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటం ఇది రెండవసారి కావడం గమనార్హం. అయితే రోడ్డుకు అడ్డంగా ఉన్న బురదతో కూడిన మట్టిపెళ్ళలు పడిపోవటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అని చెప్పాలి. అయితే ఇలా కొండ చరియలు విరిగి పడుతున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక ట్రక్కు ప్రమాదానికి గురైంది.



 అయితే ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే అక్కడ బ్రిడ్జ్ పై నిలబడిన వారందరూ కూడా ఒక్కసారిగా భయంతో వనికి పోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. రద్దీగ ఉండే శ్రీనగర్ - జమ్ము జాతీయ రహదారిపై సైతం ఇటీవల కొండ చరియలు విరిగిపడటంతో వందల మంది అందులో చిక్కుకుపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: