మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక టిప్ తయారు చేసుకుని వాడడం వల్ల పొట్ట సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. పొట్టను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…. అలాగే దీనిని ఎలా వాడడం వల్ల కలిగే చక్కటి ఫలితాలను గురించి ఇప్పడు మనం తెలుసుకుందాం. ఈ టిప్  తయారు చేసుకోవడానికి గానూ మనం వామును, సోంపు గింజలను ఇంకా అలాగే జీలకర్రను వాడాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక జార్ లో ఒక టీస్పూన్ వామును ఇంకా అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను, ఒక టీ స్పూన్ సోంపు గింజలను మీరు తీసుకోవాలి. ఇక ఆ తరువాత వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి.ఇక ఇప్పుడు ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీరుని తీసుకోవాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి.


ఇప్పుడు ఈ నీరుని చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీరుని ఒక గ్లాస్ లోకి వడకట్టుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని రోజూ ఉదయం పరగడుపున నెల రోజుల పాటు తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా కూడా బయటపడవచ్చు.ఈ డ్రింక్ ని తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరిగి అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరుగుతుంది. ఇంకా అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా ఈజీగా తొలగిపోతాయి. రక్తం కూడా బాగా శుద్ధి అవుతుంది. ఈ టిప్ ని పాటించడంతో చక్కటి జీవన విధానాన్ని కూడా పాటించాలి. ప్రతిరోజూ కూడా వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు అధిక బరువు వల్ల కలిగే వ్యాధుల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: