ప్రస్తుతం చాలామంది యువత పొట్టదగ్గరి కొవ్వు సమస్యతో సతమతం అవుతున్నారు. ఈ సమస్య వారందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనివల్ల హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, విరివిగా వస్తున్నాయి. మూత్రపిండాలు కాలేయం కూడా దెబ్బతింటున్నాయి. అందువల్ల పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవడం అవసరం.
ఈ సమస్యతో బాధపడేవారు కింద సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించు కోవడం బాన పొట్ట ను వదిలించుకోవటం పెద్ద సమస్యేమీ కాదు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా!

* పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో “ఫైబర్” బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి. దీంతోపాటు ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అందువల్ల ఫైబర్ ఉన్న ఆహారాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి.
*ఆల్కహాల్ అధికంగా సేవిస్తే కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. కనుక మద్యపానం తక్కువ చేయాలి. దీంతో కొవ్వు నిల్వలను కరిగించవచ్చు.
*చక్కెర, చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాలను, స్వీట్లను తగ్గించాలి. అలాగే అన్నంకు బదులుగా ముడి బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించవచ్చు.
*ఎరోబిక్స్, జుంబా, వెయిట్ ట్రెయినింగ్, కార్డియో వంటి వ్యాయామాలను నిత్యం చేస్తుంటే కొవ్వు త్వరగా కరుగుతుంది.
*ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. అలాగే వంటనూనెల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
*ఒత్తిడిని తగ్గించు కోవడంతోపాటు నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోతే పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించవచ్చు.
