ప్రతి ఒక స్త్రీ హీరోయిన్‌ లా అందంగా కనిపించాలని కోరుకుంటారు.ఒకప్పుడు అందానికి మారుపేరు స్త్రీ అంటుంటారు.కానీ ఇప్పుడు పురుషులు కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అలా అందంగా ఉండడానికి అందరు ఫేస్ ప్యాక్ వేయడం.. ఖరీదైన ప్రోడక్ట్ వాడటం చేస్తుంటారు.అలాంటి రసాయానాలన్ని  వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటువుంటారు. కానీ ఆరోగ్య కరమైన అలవాట్లు మీద కూడా మన చర్మ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నీరు ఎక్కువగా త్రాగడం..
చర్మాన్ని ఆరోగ్యంగా మరియు హైడ్రేట్ గా ఉంచడంలో నీరు ముఖ్యమైన భాగం. మంచి చర్మాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 8 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ తింటువుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సన్‌స్క్రీన్‌
సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వంటిది చర్మ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో ఒకటి. ఇది సూర్యుని నుండి వచ్చే UVA మరియు UVB కిరణాల వల్ల చర్మం పాడవకుండా, చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.చర్మ సంరక్షణకు మేకప్ వేసుకునే ముందు మంచి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి, మరియు మేకప్ తీసిన తరువాత వేయాలి. అప్పుడే చర్మంపై మృత కణాలు ఏర్పడకుండా ఉంటాయి.

సీరం
ఒక గొప్ప సీరం చర్మాన్ని తేమగా చేయడానికి, రిపేర్ చేయడానికి మరియు ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత దీన్ని అనుసరించాలి. సున్నితంగా మరియు స్పష్టమైన చర్మం కోసం నియాసినామైడ్‌తో కూడిన ఉత్పత్తులను వాడాలి.ఇది హైలురోనిక్ యాసిడ్‌తో చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది.

దూమపానం..
ధూమపానం కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్‌లను కూడా దెబ్బతీస్తుంది. అదనంగా ధూమపానం చర్మ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కావున  చర్మ ఆరోగ్యానికి దుమపానం మానివేయడం చాలా మంచిది.తీసుకుని ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించేవాళ్ళు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ చూపించాలని వైద్యులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: