పెళ్లయినా ప్రతి స్త్రీ కి ఎప్పుడెప్పుడు గర్భం దాలుస్తమ అని ఎదురు చూస్తుంటారు. తీరా కడుపు వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఆందోళన చెందుతుంటారు.వైద్య నిపుణులు ఐరన్ ఎక్కువగా వున్న ఆహారం, మరియు డ్రై ఫ్రూట్స్ తినమని సలహాలిస్తుంటారు. మరీ ముఖ్యంగా వాల్ నట్స్. వాల్ నట్స్ లో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ప్రతి పోషకం ఇందులో పుష్కళంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ను ఉత్తేజపరుస్తుంది.

గర్భిణీలు వాల్ నట్స్ తినడానికి రుచికరమైన, కరకరలాడుతూ ఉంటాయి.ఈ. డ్రై ప్రూట్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.ఇవి  పుట్ట బోయే బిడ్డకు మెదడు నాడివ్యవస్థ సక్రమంగా పెరిగేలా చేస్తుంది.అంతే కాక ఇందులో ఉండే ప్రోటీనులు పుట్టబోయే శిశువుకు శరీర అవయవల ఎదుగుదలకు , కంటి చూపుకు,బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.వాల్ నట్స్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి,మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గర్భధారణ సమయంలో కావాల్సిన లిపిడ్స్ నీ. పెంచుతుంది.

వాల్ నట్స్  తల్లి యొక్క బ్లడ్ ప్రెషర్ నీ తగ్గిస్తుంది.రిలాక్స్ చేస్తుంది.ఇందులో ప్రోటీన్లు మరియు ఫైబర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉండేట్లు చేస్తుంది.. దాంతో బరువును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది..


వాల్ నట్స్ లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది బిడ్డ పిటనెస్ ఉపయోగపడుతుంది.వాల్ నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ ఇ, ఫాలీ పినాల్స్, మ్యాంగనీస్, మరియు కాపర్ అత్యధికముగా ఉన్నాయి. గర్భిణీలు రోజు వారి డైట్ లో తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తాయి, రోగానిరోధక శక్తిని పెంచి తల్లి, బిడ్డ ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది.ఇవి ఎక్కువగా తినడం వల్ల గర్భిణీలు నిద్రలేమి సమస్యలను నివారించి బాగా నిద్రపట్టేలా చేస్తుంది.మరియు ఈ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ నీ కంట్రోల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: