హిందూమతంలో చెట్లను పూజించడం పురాతన కాలం నుండి వస్తోంది.ముఖ్యంగా తులసి చెట్టు పూజించడం చాలా మందికి తెలుసు.కానీ తులసితో పాటు అనేక ఇతర చెట్లు ,మొక్కలు పూజించడం కూడా చాలా ముఖ్యం.కొన్ని రకాల చెట్లను,మొక్కలను ప్రత్యేక సందర్భాలలో పూజిస్తారు.దేవతలకు ప్రీతికరమైన రోజున, వారి ప్రీతి కరమైన పూలతో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పూజిస్తారు.

అటువంటి పూలల్లో అపరాజిత పుష్పం ఒకటి.ఈ పుష్పాలు విష్ణువు,శివునికి చాలా ఇష్టమైనవని పురాణాలూ చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో అపరాజిత మొక్కను నాటితే,లోకాన్నేలే శ్రీ హరి, పరమశివుడికి అపరాజిత పుష్పాలను సమర్పించినట్లయితే,మన జీవితంలో ఉన్న ఆర్థిక మరియు మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాక ఈ పూలను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు కూడా.

అందుకే జ్యోతిష్య శాస్త్రంలో అపరాజిత పుష్పలతో, కొంతమంది దేవుళ్లను పూజించడం వల్ల జాతక దోషాలు తొలగి,వారి సమస్యలు సమిసిపోతాయి..

చాలా మందికి జాతకంలో దోషాల వల్ల,ఎంత ప్రయత్నం చేసినా,సరిపడా డబ్బు రావడం లేదు,ఆర్థిక సంక్షోభం మిమ్మల్ని వదలడం లేదు అనే వారు,సోమవారం అపరాజిత పూలతో ఈ పరిహారం చేసుకోండి.దీనికోసం సోమవారం ఉపవాసం,బ్రహ్మచర్యం వంటివి పాటించి,శివుణ్ణి భక్తి శ్రద్దలతో పూజించాలి.శివునికి అపరాజిత పుష్పాలను సమర్పిస్తు,దానితో పాటు రుద్రాక్షిమాలతోపాటు,మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.ఆ తర్వాత పూజలో సమర్పించిన ఒక అపరాజిత పువ్వుని తీసుకుని మనం డబ్బు ఉంచుకొనే అల్మారాలో పెట్టుకోవాలి.ఇలా చేయడంతో,మన ఇంట్లోకీ డబ్బు వెల్లువలా వచ్చి చేరుతుంది.

మీరు ఏదైనా ముఖ్యమైన ఉద్యోగం ఇవ్వబోతున్నట్లయితే,లేదా ముఖ్యమైన వ్యాపార మీటింగ్ చేస్తుంటే ఆ రోజు ఉదయాన్నే 5 అపరాజిత పువ్వులను తీసుకొని,మీకు ఇష్టమైన,అధిష్ఠాన దేవతను ప్రార్థించాలి.ఆ తర్వాత ఆ పువ్వులు మరియు ఒక ముక్క పటికను మీ పర్సులో ఉంచుకుంటే, మీరు చేయబోయే పనులలో విజయం కలుగుతుంది.

గురువారం పూట ఇంట్లో అపరాజిత మొక్కను నాటండం ఉత్తమం.అదే రోజున శ్రీమహావిష్ణువుకు అపరాజిత పుష్పాలను సమర్పించి, భక్తితో పూజించాలి.మరియు సోమవారం లేదా శనివారం అపరాజితా పువ్వులను ప్రవహించే నదిలో వేయడం వల్ల,జాతకంలో ఉన్న అనేక దోషాలు తొలగిపోయి,ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: