ఇళయరాజా పాటలు,సినిమాటోగ్రఫీ, చిత్ర నిడివి తక్కువగా ఉండటంఇళయరాజా పాటలు,సినిమాటోగ్రఫీ, చిత్ర నిడివి తక్కువగా ఉండటంనెమ్మదిగా సాగే కథనం, సన్నివేశాలలో పట్టు లేకపోవడం, ఎడిటింగ్, మాటలు.

కాళిదాసు (ప్రకాష్ రాజ్) పురావస్తు శాఖలో అధికారి గా పని చేస్తూ ఉంటాడు, భోజన ప్రియుడు అయిన కాళిదాసు కి వయసు దాటిపోయినా పెళ్లి కాదు. కాళిదాసు పెళ్లి చెయ్యడానికి సకల విధాలుగా ప్రయత్నిస్తుంటాడు ఎమ్మెస్ నారాయణ. అదే సమయంలో ఉద్యోగ వేట కోసం కాళిదాసు దగ్గరకు వస్తాడు అతని మేనల్లుడు నవీన్(తేజస్) . గౌరీ (స్నేహ) ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తనకి జాతకంలో ఉన్న దోషం మూలాన ఆమెకి పెళ్లి కాదు.మేఘన(సంయుక్త) ఉద్యోగ వేట కోసం అక్క గౌరీ తో కలిసి ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా గౌరీ మరియు కాళిదాస్ లకు ఫోన్ లో గొడవ అవుతుంది. ఆ తరువాత అది రాంగ్ నెంబర్ అని తెలుసుకొని ఇద్దరు క్షమాపణలు చెప్పుకుంటారు అప్పటి నుండి వారి మధ్యన బంధం బలీయం అవుతూ ఉంటుంది. ఒకరోజు ఇద్దరు కలవాలని నిశ్చయించుకుంటారు. కాని తన వయసు గురించి ఆలోచించిన కాళిదాసు గౌరీ ని కలవడానికి సంశయిస్తాడు, వారిద్దరూ కలిసారా లేదా? కలిస్తే ఎలా కలిసారు? నవీన్ మరియు మేఘన ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెర మీదనే దొరుకుతుంది..

ప్రకాష్ రాజ్ , విలక్షణ నటుడి గా పేరొందిన ఈ నటుడు ఈ చిత్రంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో ఈ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయారు. స్నేహ పాత్రకు తగ్గ నటన కనబరిచింది కాని తన ప్రయత్నం అయితే చేసింది కాని ఈ పాత్రకు తగ్గ సన్నివేశాలు సరిగ్గా లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తేజస్ పాత్ర చాలా చిన్నది ఉన్నంతలో బాగానే నటించాడు ఈ నటుడు , ఇక మరో కథానాయికగా నటించిన సంయుక్త నటనాపరంగా తన అమాయకమయిన హావభావాలతో ఉన్నంతలో ఆకట్టుకుంది కాని ఈ నటి పాత్ర కూడా చిన్నది కావడంతో అంతగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ఎం ఎస్ నారాయణ మరియు బ్రహ్మాజీ అక్కడక్కడ నవ్వులు పండించారు. ఐశ్వర్య, ఊర్వశి తెర మీద తళుక్కుమన్నారు.

ఈ చిత్రం మలయాళ చిత్ర రీమేక్ కావడంతో కథ అందులో నుండి తీసుకున్నారు, కాని ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్చడానికి ప్రయత్నించారు అవేవి ఫలించకపోగా తిప్పికొట్టాయి. ఇక ప్రకాష్ రాజ్ స్వయంగా రాసుకున్న కథనం విషయానికి వస్తే నె..మ్మ..ది..గా సాగుతుంది. ఎంత నెమ్మదిగా అంటే రెండు గంటల చిత్రంలో రెండు సంవత్సరాలు గడిపేశాం అన్న భావన కలిగేంత నెమ్మదిగా సాగుతుంది. వల్లభ అందించిన మాటలు అంతంతమాత్రమే ఒక్కోసారి సన్నివేశం బలంగా ఉన్న అక్కడ సరయిన డైలాగ్ రాకపోవడంతో సన్నివేశం నీరు గారిపోయింది. సినిమాటోగ్రఫీ అందించిన ప్రీత ఈ విభాగానికి పూర్తి న్యాయం చేసాడు కాని రెండు మూడు రకాల లైటింగ్ విధానాలు ఉపయోగించడం మూలాన ఒక్కో సన్నివేశం ఒక్కో రకమయిన ఫీల్ కలిగిస్తుంది. చిత్రం చిన్నదే అయిన ఎడిటింగ్ విభాగం మరింత కత్తిరించి ఉండవచ్చు కొన్ని సన్నివేశాలను అనవసరంగా పొడిగించిన ఫీలింగ్ వచ్చింది అలాగే కొన్న్ని అనవసరమయిన సన్నివేశాలు ఉన్నాయి చిత్రాన్ని మరొక పది నిమిషాల వరకు కత్తిరించవచ్చు. ఇళయరాజా అందించిన సంగీతం లో పాటలు చాలా బాగున్నాయి కాని నేపధ్య సంగీతం విషయానికి వచ్చే సరికి కొన్ని సన్నివేశాలలో అవసరానికి మించి నేపధ్య సంగీతం అందించారేమో అన్న భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి..

రీమేక్ చిత్రం అనగానే కథ మాత్రమే తీసుకుంటే సరిపోదు చిత్రంలోని ఆత్మను తీసుకొని దాన్ని అదే స్థాయిలో చూపెట్టాలి. ఈ చిత్రంలో మిస్ అయ్యింది అదే, "సాల్ట్ అండ్ పెప్పర్" అనే మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో కూడా అదే కథ అవే సన్నివేశాలు కాని చిత్రం ఆసాంతం ఒక్క చోట కూడ పట్టు ఉన్నట్టు అనిపించదు. ముఖ్యంగా పాత్రలను పూర్తి స్థాయిలో వివరించలేకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం, వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని సరిగ్గా చూపించలేక పోవడం మరో లోపం, నిజానికి ఇదే కథతో గతంలో "లవ్లీ" అనే చిత్రం వచ్చింది. అంతే కాకుండా హిందీ లో వచ్చిన "ముజ్ సే ఫ్రాండ్ షిప్ కరోగి" చిత్ర కథ కూడా దాదాపు ఇలానే ఉంటుంది కాబట్టి దర్శకుడు కథనం మీద దృష్టి సారించవలసింది, అందమయిన భావాలతో కూడిన తేలికయిన సన్నివేశాలు రాసుకొని ఉంటె చాలా బాగుండేది కాని దర్శకుడి ఆలోచన మరోలా ఉంది అనవసరమయిన ట్రాక్ లు పెట్టుకొని సందేశాలు ఇవ్వాలని ప్రయత్నించారు. అందులోనూ ఇటు ప్రధాన పాత్ర మరియు దర్శకత్వం అంటూ ప్రకాష్ రాజ్ డబల్ రోల్ ని మూడు బాషలలో చెయ్యడం చిత్రం మీద చాలా ప్రభావం చూపించింది. ఈ ప్రభావం వలన చిత్రం చాలా దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బి మరియు సి సెంటర్ చిత్రం కాదు అదే సమయంలో ఏ సెంటర్ జనం కి నచ్చే అవకాశాలు తక్కువ. మొదటి అర్ధ భాగం కాస్తో కూస్తో బాగుంది రెండవ అర్ధ భాగం పూర్తిగా నెమ్మదించింది. సన్నివేశం అర్ధం అయిపోయాక కూడా తరువాత సన్నివేశం కోసం ప్రేక్షకుడు చాలా సేపు వేచి చూడవలసి వచ్చింది. ఇలా ఈ చిత్రంలో చెప్పుకోడానికి చాలా మైనస్ లే ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే "ఉలవచారు బిరియాని" లో "సాల్ట్ అండ్ పెప్పర్" లేదు.. ఇక చూడాలా వద్దా అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాం, మా సలహా అయితే థియేటర్ లో బిరియాని కన్నా బయట బిరియాని చాలా బాగుంటుంది..

Prakash Raj,Sneha Prasanna,Illayaraja."ఉలవచారు బిరియాని" లో "సాల్ట్ అండ్ పెప్పర్" లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: