ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లకు పెళ్లి చేసుకోవడం, అలాగే కొద్ది రోజులు ఎంజాయ్ చేయడం, విడిపోవడం కామన్ అయిపోయింది. అది కూడా కొందరి విషయంలోనే. మరి కొందరేమో పెళ్లి చేసుకున్నాక హాయిగా జాలి ట్రిప్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా వారు ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానుల తో షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కొద్ది రోజులు బాగానే ఉన్న జంటలు విడిపోయి, ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఇంటర్నెట్ సెన్సేషన్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను గోవా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సామ్ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త తనని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు అంటూ పూనమ్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు కనకోన పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ తెలిపారు.


 అనంతరం ఆమెను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.అయితే  ఇప్పటివరకు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా లో నుంచి సామ్ తీసివేయడం తో ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు. పూనమ్ పాండే, సామ్ బాంబేల వివాహం పది రోజుల క్రితం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫొటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం గోవాలో హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూ వస్తోంది. అప్పుడే ఏదో జరిగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు మ్యాటరెంటో పోలీసులు చెప్పాలి. అవి కాస్త కామెంట్లతో వైరల్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: