
ఇక ఆ మధ్యలో జబర్దస్త్‌లో ఒక జడ్జిగా పనిచేసిన నాగబాబు మరో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగులోకి వెళ్లి..
అక్కడ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించారు.దీన్ని ప్రారంభించే సమయంలో చాలా హైప్‌ని తీసుకొచ్చారు. అంతేనా జబర్దస్త్‌కి సెటైర్‌గా ప్రోమోలను కూడా విడుదల చేశారు. కానీ ప్రారంభం అయిన తరువాత మాత్రం జబర్దస్త్‌ని బీట్ చేయలేకపోయింది.ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం టాప్ 1ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా కొనసాగుతున్న స్టార్ మా మరో ప్రయోగం చేయబోతోంది. కామెడీ స్టార్స్ పేరుతో స్టార్‌లో మాలో ఒక కొత్త షో రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు.
ఇందులో శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి జడ్జిలుగా ఉండబోతున్నారు. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ రవిలు కూడా ఈ ప్రోమోలో కనిపించారు. వీరితో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అవినాష్, అరియానా, అషు రెడ్డి, సుజాతలు కూడా ఈ ప్రోగ్రామ్‌లో కనిపించనున్నారు.అలాగే చమ్మక్ చంద్ర, యాదమ్మ రాజు, బేబి సహృద(కార్తీక దీపం హిమ) తదితరులు కనిపించారు. ప్రోమో చూస్తుంటే అందరినీ ఆకట్టుకుంటోంది... మరి స్టార్ మా చేస్తున్న ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందా..?లేక తుస్సుమంటుందా.. అనేది రానున్న రోజుల్లో తేలనుంది.. ఏది ఏమైనా ..బుల్లితెరపై ఎన్ని కామెడీ షో లు వచ్చినా జబర్దస్త్ ని డీ కొట్టలేవు అనేది కొందరి వాదన..!!