తెలుగు హీరోయిన్ అవికా గౌర్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ప్రస్తుతం ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈమె సినిమాలలో కాన ముందే తన చిన్న వయస్సులోనే బుల్లి తెరపై సందడి చేసింది. గతంలో చిన్నారి పెళ్లి కూతురు అనే ధారావాహిక సీరియల్ లో నటిచింది. ఈ సీరియల్ మా టీవిలో ప్రసారం కావడంతో. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈమెను బాగా గుర్తించుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది. ఈమె నటనకు మెచ్చి మన తెలుగు ఇండస్ట్రీ ఈమెకు సినిమా అవకాశాన్ని కల్పించింది. అలా అవికా గౌర్ హీరోయిన్ గా మన ముందుకు వచ్చారు. తన మొదటి సినిమా ఉయ్యాలా జంపాల లో హీరో రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని ఇచ్చింది.

ఆ తరువాత సినిమా చూపిస్త మావా మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో నటిగా మరింత ముందుకు వెళ్లగలిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందో ఏమో తెలియదు కొంతకాలం తెలుగు వారికి కనుమరుగయింది. అవికా గౌర్ నటించిన రోడ్స్ 17 లో తనతో నటించిన మిలింద్ చంద్వానీ తో అప్పటికే ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అవికా గౌర్ ప్రేక్షకులకు తెలియచేసింది.  ప్రస్తుతం ఒక వార్త మాత్రం ఆమె అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. ఈమెకు ఒక చర్చిలో వేరే వ్యక్తితో పెళ్లి అయినట్లుగా రెండు రోజుల క్రితం ఫోటోలు హల్ చల్ చేశాయి.  అతను స్వయంగా తన సహనటుడు ఆదిల్ ఖాన్ కావడం విశేషం. అయితే ప్రేక్షకులు అదేంటి ఈమె ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంది అని రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇంతలోనే మరో షాకింగ్ న్యూస్ తెలిసింది.

అదేమిటంటే అవికా గౌర్ కి జరిగింది నిజమైన పెళ్లి కాదట. ఇది కేవలం ఒక ప్రైవేట్ సాంగ్ ను షూట్ చేసే భాగంలో ఒక సీన్ అని తరువాత అవికా గౌర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఫామ్ లో లేని హీరోయిన్లు సైతం ప్రైవేట్ సాంగ్స్ మరియు వెబ్ సిరీస్ లు చేసుకుంటున్నారు. ఇదే దారిలో మన అవికా గౌర్ కూడా చేస్తోంది. ఈమె కాదిల్ అనే ప్రైవేట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఏమైతే ఏంటి....ఈ ఫోటో ద్వారా ఈ సాంగ్ కి కావాల్సిన ప్రమోషన్స్ దక్కాయని ఆ యూనిట్ అంతా అనుకుంటున్నారు. ఇది తెలుసుకున్న ఆమె అభిమానులు అయ్యో...విషయం తెలుసుకోకుండా అనవసరంగా అవికా గౌర్ ని అపార్ధం చేసుకున్నామే అని బాధపడుతున్నారు.   అందుకే చూసిందంతా నిజం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: