టాలీవుడ్లో తమ్ముడు
జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా దూసుకెళుతున్నా.. అన్న కల్యాణ్
రామ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. దాదాపు రెండు దాశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. అతడి హిట్లు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో కల్యాణ్
రామ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో
సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ
సినిమా సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. కాగా.. ఈసినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డైట్ ఇప్పుడు బయటకొచ్చింది.
మే 28 అంటే శుక్రవారం
నందమూరి తారకరామారావు
జయంతి సందర్భంగా ఈ అప్ డేట్ రానుందట. ఈ అప్ డేట్ విషయానికి వస్తే. కల్యాణ్
రామ్ కొత్తగా నిస్తున్న
సినిమా టైటిల్ రివియల్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం అఫీషియల్‌గా వెల్లడించింది. సీనియర్
ఎన్టీఆర్ మనవడు,
హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ
సినిమా టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్
మీడియా ద్వారా తెలిపింది.

ప్రముఖ
నిర్మాత మల్లిడి సత్యనారాయణ
రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీలో నటిస్తున్నాడు
కళ్యాణ్ రామ్.
ఎన్టీఆర్ బ్యానర్‌పై రూపొందుతున్న దీనికి ఆయన బావమరిది
హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్ళు 'రావణ' అనే టైటిల్ పెట్టనున్నట్టు ప్రచారం జరిగింది. మరి అదే టైటిల్ ఫైనల్‌గా ప్రకటించనున్నారా..? లేక మరోటి ప్రకటించనున్నారా..? అనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే ఈ విషయంలో కల్యాణ్
రామ్ మాత్రం క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే 28న ఈ
సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
కళ్యాణ్
రామ్ - వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడు. కాగా ఈ సినిమాతో పాటే మైత్రీ
మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు
కళ్యాణ్ రామ్. దీని ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇంతకుముందు కూడా కల్యాణ్
రామ్ ఓ ఫాంటసీ
సినిమా చేశాడు.
118 అనే ఆ సినిమాలో కలల్లో ప్రవేశిస్తూ కీలక పాత్రలోనివేదా థామస్.