
షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఆర్యన్ ఖాన్‌ని హీరోగా లాంచ్ చేస్తాడనే ప్రచారం జరిగింది. షారుఖ్ ఫీచర్స్‌తో ఉన్న ఆర్యన్‌తో లవ్‌స్టోరీస్ తియ్యడానికి కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ టైమ్‌లోనే డ్రగ్స్ కేసుతో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. దీంతో వారసుడి కెరీర్ ఏం అయిపోతుందో అని టెన్షన్ పడుతున్నాడట షారుఖ్. షారుఖ్ ఖాన్ గ్రాఫ్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తర్వాత షారుఖ్‌కి సరైన హిట్‌లేదు. ఎనిమిదేళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక 'జీరో' సినిమా అయితే షారుఖ్‌ని గట్టిగా దెబ్బకొట్టింది. షారుఖ్ సొంత బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మరో సినిమా చెయ్యడానికి రెండేళ్లకి పైగా గ్యాప్ తీసుకున్నాడు షారుఖ్.
షారుఖ్ ఖాన్ కరోనా ఫస్ట్ వేవ్ ముగిసాక మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్' మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా అలా సెట్స్‌కి వెళ్లిందో లేదో సెకండ్ వేవ్‌తో బ్రేకులు పడ్డాయి. ఈ ప్రభావం నుంచి కోలుకొని మళ్లీ షూటింగులు గాడినపడగానే అట్లీ డైరెక్షన్‌లో సినిమా లాంచ్ చేశాడు. అయితే ఇప్పుడు కొడుకు కేసుతో ఇంటికే పరిమితమయ్యాడట షారుఖ్.సినిమాల్లో స్టార్డమ్ సంపాదించుకుంటాడు అని కలలు కంటోన్న కొడుకు కస్టడీలో ఉండడంతో షారుఖ్ ఖాన్ షూటింగులపై కాన్సన్‌ట్రేట్ చేయలేకపోతున్నాడట. ఆర్యన్ ఖాన్ బయటకొచ్చేవరకు షూటింగ్స్ అన్నింటికి బ్రేకులు ఇస్తున్నాడట షారుఖ్. మరి ఇన్ని ఎదురుదెబ్బలు తింటోన్న షారుఖ్ వీటినుంచి ఎప్పటికి బయటపడతాడో చూడాలి.