మాస్ రాజా రవితేజ హీరోగా మంచి జోష్ లో ఉన్న సమయంలో ఆయన హీరో గా తెరకెక్కిన చిత్రం భద్ర. ఇది టాలీవుడ్ లో ఎంతటి పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలవగా తొలి సినిమా తోనే ఆయన తన దర్శకత్వ ప్రతిభను చాటుకుని ఆటు హీరో రవితేజ కి తనకు తమ కెరీర్ లోనే సూపర్ హిట్ అందుకునేలా చేసుకున్నాడు.

బోయపాటి శ్రీను దర్శకుడిగా తొలి అడుగులు వేసే రోజులలో భద్ర సినిమా కథను నిర్మాత దిల్ రాజు కు చెప్పగా సింగిల్ సిట్టింగ్ లోనే ఈ సినిమా కథను ఓకే చేశాడు దిల్ రాజు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే విధంగా ఉండే దిల్ రాజు ఆలోచనలు బోయపాటి శ్రీను దర్శకుడి గా పరిచయం చేసేలా చేశాయి. రవితేజ ను హీరోగా అనుకున్న తరువాత ఈ సినిమా బోయపాటి శ్రీను తన తరహాలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని ఆదుకున్న భద్ర అనే యువకుడి కథే సినిమా.  రాయలసీమలో తన స్నేహితుడును చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ యువకుడి ఎంత పెద్ద సాహసం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ఫ్యాక్షన్ నేపథ్యం గా నిర్మితమైన ఈ సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించి ఎన్నో భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమా రవితేజకు చెప్పుకోదగ్గ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా ఆయన తొలిసారిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: