టాలీవుడ్ లో ప్రభాస్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ కు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ప్రభాస్ సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సినిమాలు అన్ని కూడా ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా ప్రభాస్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఈ సినిమా తరువాత ప్రభాస్ కి ఒక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చిందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక లవ్ స్టొరీ ని వీళ్లిద్దరు కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ కూడా సంజయ్ లీలా బన్సాలీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

బోనీకపూర్ అలాగే సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని సంజయ్ లీలా బన్సాలీ కథను సిద్ధం చేసుకున్నారని కూడా సమాచారం. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉందని చారిత్రాత్మక కథ ఆధారంగా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ హీరోయిన్స్ ఇద్దరు నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: