అయితే ఆ సినిమా విషయంలో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ వద్దు అని చెప్పినట్టుగా టాలీవుడ్ వర్గాలు అన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కాస్త విజయ్ సేతుపతి తో మాట్లాడిన తర్వాత ఆ సినిమా విలన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అనేది టాలీవుడ్ మాట. అయితే ఇతర హీరోల సినిమాల విషయంలో కూడా విజయ్ సేతుపతి అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అతన్ని టాలీవుడ్ లో పక్కనపెట్టారు అనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.
దీంతో చాలా మంది హీరోలు విజయ్ సేతుపతి తో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టి నట్టు గా వస్తున్న వార్తలు ఆయన అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి అనే చెప్పాలి. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా లేకపోయుంటే సినిమా ఘోరంగా విఫలమయ్యేది. విజయ్ సేతుపతి నటన కారణంగా సినిమా తమిళనాడులో కూడా బాగానే ఆడింది అని చెప్పాలి. మరి భవిష్యత్తులో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తగ్గించుకుని తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేకపోతే ఇదే విధంగా ముందుకు వెళ్తారా అనేది చూడాలి.