థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్ కూడా కీలక పాత్ర చేసిన ఈ సినిమా రవితేజ, గోపీచంద్ ల కెరీర్ హ్యాట్రిక్ విజయం అనే చెప్పాలి. అంతకముందు వీరిద్దరూ కలిసి చేసిన డాన్ శ్రీను, బలుపు సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక క్రాక్ విషయానికి వస్తే మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాని రవితేజ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా తీశారు.
ముఖ్యంగా ఈ సినిమాకి రవితేజ పవర్ఫుల్ యాక్షన్, డైలాగ్స్, ఫైట్స్, థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇక హీరోయిన్ గా తన అందం, అభినయంతో శృతి తన క్యారెక్టర్ లో ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేసారు అనే చెప్పాలి. సాయి కుమార్ సోదరుడు రవిశంకర్, హ్యాపీ డేస్ ఫేమ్ వంశీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు చేసారు. ఇక రిలీజ్ తరువాత చాలా ఏరియాల్లో అద్భుతమైన కలెక్షన్ దక్కించుకున్న క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.