ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోందని తెలుస్తుంది. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయట.రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ జోరు కూడా పెంచిందని సమాచారం.

ఈ క్రమంలో టీమ్ సభ్యులు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేస్తున్నారట. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రాజమౌళి మూవీస్ గురించి ఓ క్రేజీ విషయం చెప్పారట. రాజమౌళి సినిమాలన్నింటిలో ఏయా విభాగాలు సినిమాను డామినేట్ చేసేవో చెప్పుకొచ్చారట. ‘స్టూడెంట్ నం.1’ లో మ్యూజిక్ అలాగే ‘సింహాద్రి’లో స్టోరీ, ‘సై’లో డైరెక్షన్ మూవీని డామినేట్ చేశాయని చెప్పుకొచ్చారట. ‘ఛత్రపతి’ మూవీకి మాత్రం అన్నీ సమపాళ్లలో కుదిరాయని వివరించారట. అయితే ‘విక్రమార్కుడు’ విషయంలో మాత్రం వీటికి భిన్నంగా జరిగిందని కీరవాణి వివరించారట. హీరో రవితేజ సినిమా మొత్తాన్ని డామినేట్ చేశారని కీలక కామెంట్స్ చేశారట..

‘విక్రమార్కుడు’ 2006లో విడుదలయ్యిందని దొంగగా మరియు పోలీస్‌గా రవితేజ అదరగొట్టాడట.మాస్ ఆడియెన్స్ ఈ మూవీకి క్యూ కట్టడంతో సినిమా ప్రభంజనం సృష్టించిందట. అత్తిలి సత్తిబాబు మరియు విక్రమ్ సింగ్ రాఠోడ్ పాత్రల్లో రవితేజ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడట. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమారాజమౌళి కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్ హిట్ అని చెప్పవచ్చు.

కాగా జక్కన్న రాజమౌళి కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుందట రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారట. ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్గణ్, శ్రియ సముద్రఖని, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారట డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారట . రీసెంట్‌గా విడుదలైన చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.ఈ సినిమా కోసం 3సంవత్సరాలు అలుపెరుగనిపోరాటం చేసాడట రాజమౌళి. మరి ఆ కష్టానికి తగిన విధమైన ఫలితం దక్కుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: