టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ప్రెస్ మీట్స్ తో బిజీ అవుతున్నారని సమాచారం.

ఇక నేడు తెలుగు మీడియా ముందుకు వచ్చిన rrr చిత్ర యూనిట్ సభ్యులు వారి అనుభవాలను మీడియా మిత్రులతో పంచుకున్నారట. అంతేకాకుండా అనేక రకాల సందేహాలకు సమాధానాలు ఇచ్చారని తెలుస్తుంది.అయితే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఆ పాత్రకు ఎదురుగా వచ్చిన ఒక పులి సినిమా ట్రైలర్ లో కూడా హైలెట్ గా నిలిచిందని తెలుస్తుంది. అయితే ఒక విలేకరి ఆ సీన్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశ్నించాడని సమాచారం. టైగర్ కు మీరు భయపడ్డారా లేకపోతే ఆ సీన్ లో రాజమౌళి గారు మిమ్మల్ని భయ పెట్టారా అని అడిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడని తెలుస్తుంది. నిజానికి ఆ సీన్ లో పులి లాగ గర్జియించింది రాజమౌళి గారే అంటూ.. తెలిసిన పులి కాబట్టి నేను కూడా ఒక అరుపు అరిచానని జూనియర్ ఎన్టీఆర్ వివరించాడని తెలుస్తుంది.

 

అంటే గ్రాఫిక్స్ చేయడం కంటే ముందు లైవ్ లోకేషన్ లో టైగర్ గా కనిపించింది అరిచింది రాజమౌళి గారే అని క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది. ఇక సినిమాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా హైలెట్ గా ఉంటాయని ముఖ్యంగా టైగర్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని అర్థమవుతున్నట్లు తెలుస్తుంది.. ఇక దర్శకుడు రాజమౌళి సాధారణంగా ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో హీరో పాత్రలను అంతకుమించి అనేలా చూపిస్తాడని తెలుస్తుంది.

ఇక మొదటిసారి అల్లూరి సీతారామరాజు లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ చూపిస్తున్నాడని కాబట్టి మరింత ఉన్నత స్థాయిలో ప్రజెంట్ చేస్తాడు అని చెప్పవచ్చని తెలుస్తుంది. ఇక rrr సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: