తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు తాజాగా శనివారం రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘట్టమనేని రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇక ఇదిలా ఉంటె..  మరొక వైపు హీరో మహేష్ బాబు ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకడం వల్ల క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే అన్న చనిపోయినా కూడా అంత్యక్రియలకు రాలేని పరిస్థితుల్లో ప్రస్తుతం మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరి డాక్టర్ల సూచన మేరకు నిబంధనలు పాటిస్తూ అతడు అన్న అంత్యక్రియలకు వస్తాడా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే రమేష్ బాబు విషయానికి వస్తే.. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత పలు సినిమాల్లో నటుడిగా నటించి, సామ్రాట్ అనే సినిమాతో హీరోగా పరిచయమైయ్యారు.

అయితే ఆయన హీరోగా దాదాపు 15 సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రమేష్ బాబు చివరగా 1997లో వచ్చిన ఎన్ కౌంటర్ సినిమాలో సహాయ నటుడిగా నటించారు. ఇక సినిమానే రమేష్ బాబుకు అదే చివరి సినిమా. ఈ మూవీ తరువాత సినిమాలలో నటించక పోవడంతో పాటుగా సినీ ఇండస్ట్రీకి దూరమైయ్యారు. రమేష్ బాబు తన సోదరుడు మహేష్ బాబుతో తెలుగులో అర్జున్, అతిథి లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు.. బాలీవుడ్ బిగ్ బీ అయిన అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశం సినిమాన్ని చిత్రీకరించారు. కాగా.. సూర్యవంశం సినిమా తో రమేష్ బాబు, అమితాబ్ బచ్చన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం.. ఓ కనెక్షన్ వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: