కమల్ గారాల పట్టి శృతి హాసన్ సినిమాల్లో నటిస్తూ లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియా లో టచ్ లో ఉండే శృతి హాసన్ తన బోయ్ ఫ్రెండ్స్ తో అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు. అంతకుముందు మైఖెల్ కోర్సలే తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శృతి హాసన్ ఒకానొక దశలో అతన్ని పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అతని నుండి దూరమై ఇప్పుడు శాంటాను హజారికతో ప్రేమలో ఉంది శృతి హాసన్.

కొద్దిరోజులుగా శృతి హాసన్ సోషల్ మీడియాలో అతనితో క్లోజ్ గా దిగుతూ ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఇక శృతి ఎక్కడ ఉంటే శాంతాను కూడా అక్కడ కనిపిస్తున్నాడు. మీడియా రకరకాల వార్తలు రాస్తూ వచ్చింది. ఫైనల్ గా ఫ్యాన్స్ తో చేసిన ఇన్ స్టాగ్రాం లైవ్ లో శాంతానుతో తన లవ్ కన్ ఫర్మ్ చేసింది శృతి హాసన్. అతనికి తనే ముందు ప్రపోజ్ చేశానని అన్నది శృతి హాసన్. శాంతానుతో అయినా శృతి ఏడడులు వేస్తుందా లేదా అంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో హిట్ అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం బాలయ్య 107వ సినిమాలో నటిస్తుంది. ఇదే కాదు మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సినిమాలతో పాటుగా తన పర్సనల్ విషయాల్తో కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది శృతి హాసన్. లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం వెనకాడని శృతి హాసన్ తన ప్రతి మూమెంట్ ని పూర్తిగా ఆస్వాధిస్తుందని చెప్పొచ్చు. తన రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: