టాలెంట్ ఉంటే ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకుడు కైనా ఛాన్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడటం లేదు మన హీరోలు. ఇటీవల కాలంలో అనుభవాన్ని కాకుండా మన హీరోలు టాలెంట్ ను నమ్మి సినిమాలు చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ దర్శకులుగా మరొక మెట్టు ఎక్కడానికి కారణం అవుతున్నారు మన హీరోలు. అలాంటి వారిలో ఒకరు రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడిగా పరిశ్రమలోకి వచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుని ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్నాడు.

ఓ వైపు అగ్ర దర్శకుల తో సినిమాలు చేస్తూనే మరోవైపు యువ దర్శకులకు సైతం వరుసగా ఛాన్స్ లు ఇస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన శంకర్ లాంటి అగ్ర దర్శకులతో పని చేస్తూనే మరొకవైపు గౌతమ్ తిన్ననూరి వంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఇలా యువ దర్శకులతో పని చేయడం కొత్తేమీ కాదు. గతంలో చిన్న సినిమాలు చేసుకునే సంపత్ నంది తో కలిసి రచ్చ అనే సినిమా చేసి దర్శకుడిగా ఆయనకు మంచి లిఫ్ట్ ఇచ్చారు రామ్ చరణ్. 

ఆ తర్వాత ఆయన యువ దర్శకులతో ఎక్కువగా ముందుకు వెళ్లలేదని చెప్పాలి. కేవలం అగ్ర దర్శకులతో వెళ్లి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ అనే దర్శకుడితో కలిసి ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన రాహుల్ సాంకృత్యాయన్ రామ్ చరణ్ కు నచ్చే కథ తయారు చేయడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలుస్తుంది. ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు రాహుల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: