టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ సుపరిచితుడు. ఇప్పటివరకు ఎన్నో ఫ్యామిలీ ఒరియంటెడ్, యాక్షన్ సినిమాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంచెం ఫామ్‌లో తగ్గినా.. ‘కల్కి, గరుడవేగ’ సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి స్టోరీ సెలక్షన్‌లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ఏజ్‌లో కూడా తన లుక్, స్టైల్‌ను ఏ మాత్రం తగ్గించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ‘శేఖర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ లుక్ అదిరిపోయింది.  


రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజశేఖర్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా రాజశేఖర్.. బుల్లితెర సెన్సెషనల్ ప్రొగ్రామ్ ‘ఆలీతో సరదాగా’ సినిమాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు. ఈ షోలో హోస్ట్ ఆలీ అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన ఆన్సర్స్ ఇచ్చారు రాజశేఖర్ దంపతులు.


రాజశేఖర్, జీవిత ఇద్దరూ మొదటగా కలుసుకున్న విషయాలన్ని చెప్పుకొచ్చారు. అలాగే రాజశేఖర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ టైంలో రాజశేఖర్ బతుకుతారని అనుకోలేదంట. అప్పుడు జీవిత, పిల్లలను ధైర్యంగా ఉండాలని చెప్పారని, తనకు ఆ సమయంలో బతుకుతానని ఆశలు కూడా లేవని రాజశేఖర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అప్పుడు ఎంతో బాధ వేసిందని, షోలో ఎంతో ఎమోషనల్ అయ్యారు రాజశేఖర్. కరోనా నుంచి బయట పడ్డారంటే కేవలం ప్రేక్షకుల ప్రార్థనలు, కుటుంబ సభ్యుల సపోర్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే జీవిత కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. షోలో ధ్రువ సినిమా గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది.


హీరో రామ్ చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా మీకు గుర్తుకు ఉంటే ఉంటుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో అరవింద స్వామి ఎంతో అద్భుతంగా నటించారు. నిజానికి అరవింద స్వామి పాత్రలో రాజశేఖర్‌కు ఇస్తే బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డిని అడిగానని, దానికి తను ఒప్పుకోలేదని జీవిత చెప్పుకొచ్చారు. దీంతో ధ్రువ సినిమా ఆఫర్ పోయిందన్నారు. కాగా, మంచి పాత్ర ఎలాంటిదైనా అందులో నటించేందుకు తను సిద్ధమని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: