కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ కూడా మంచి ఆదరణ అనేది లభిస్తూనే ఉంటుంది. అది థియేటర్ అయినా ఇంకా ఓటీటీ వేదిక అయినా ప్రేక్షకుల కన్ను కచ్చితంగా పడుతుంది. ఇక అలాంటి లిస్టులోనే చేరిపోయింది వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్దార్ ఇంకా రామ్ కార్తిక్ నటించిన 'రామ్ అసుర్' సినిమా. రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి సత్తా చాటిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా ఓటీటీ వేదిక అమెజాన్‌లో రిలీజ్ అయ్యింది. దీంతో ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమాకి వస్తున్న ఈ రెస్పాన్ చూసి దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.డైమండ్ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఈ మూవీలోని ప్రతి సీన్ ని కూడా దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ ప్రతిభను వెలికితీసింది.ఈ సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యేలా ఈ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కలికాలంలో మంచి- చెడు అనే కాన్సెప్ట్ తీసుకొని జనాలకు కనెక్ట్ అయ్యే సీన్ లతో ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి మేజర్ అసెట్ అయింది. ఇకపోతే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ 'రామ్ అసుర్' సినిమాతో మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. సూరి పాత్రలో ఆయన ఒదిగి నటించిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. సినిమాలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్‌గా ప్రేక్షకుల నోళ్ళలో ఇప్పుడు నానిపోయాడు.

ఎఎస్‌పి మీడియా హౌస్ ఇంకా జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అభినవ్ సర్ధార్‌ ఇంకా వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మించడం జరిగింది.ఈ 'రామ్ అసూర్' చిత్రానికి థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ఒకెత్తయితే, ఓటీటీలో కూడా అదే రేంజ్ ఆదరణ లభిస్తుండటం అనేది చాలా మంచి విషయం. ఇక ఇలాంటి విలక్షణ కథలు మరిన్ని తెరకెక్కించేలా సినిమా యూనిట్‌కి ఈ విజయం మంచి బూస్టింగ్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: