సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతాయని పుకార్లు వినిపిస్తుంటాయి. అందుకే కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే వారు తెలిసిన వారి నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు వేస్తారు. ఇండస్ట్రీలో కొందరిని నమ్మొచ్చు.. మరికొందరిని నమ్మకపోవచ్చు. ఇండస్ట్రీలో బాగా పరిచయమై.. ప్రాణ స్నేహితులుగా కొనసాగుతున్న వారున్నారు. అదే ఇండస్ట్రీలో కలిసి పని చేసినా.. మనస్పర్థలు వచ్చి బద్ధ శత్రువులుగా మారిన వారు ఉన్నారు. అయితే హీరో జగపతిబాబు మాత్రం తనకు ఇండస్ట్రీలో నమ్మదగిన వ్యక్తి, విశ్వాసపాత్రుడు తనే అంటూ.. ఆ స్టార్ హీరో పేరు చెప్పారు.


టాలీవుడ్‌లో జగపతిబాబుకు మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో మంచి ఫ్యామిలీ ఓరియంట్ సినిమా హీరోగా అలరించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇటీవల ఆయన అఖండ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టి.. రికార్డుల వర్షం కురిపించింది. అయితే ఎలాంటి పాత్రల్లోనైనా నటించే కెపాసిటి జగపతిబాబుకి ఉంది. అఖండ సినిమాలో అతడి రోల్‌కు మంచి స్పందనే వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన జగపతిబాబు.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ‘ఏ ఇండస్ట్రీలో అయినా స్నేహితులు ఉంటారు. కానీ నాకు సినీ ఇండస్ట్రీలో స్నేహితులు ఎక్కువగా లేరు. నాకు కేవలం హీరో అర్జున్ మాత్రమే మంచి ఫ్రెండ్. ఎన్నో ఏళ్లుగా మా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. దానివల్లే మేమిద్దరం పలు సినిమాల్లో కలిసి నటించాం.’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే అందరి స్నేహితులలాగే మేము కూడా గొడవలు పడేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. 


ఆ గొడవలను పక్కవాళ్లు చూస్తే.. వీళ్లేంది బద్ధ శత్రువుల్లా కొట్లాడుకుంటున్నారని అనేంతలా గొడవ పడేవాళ్లమని చెప్పుకొచ్చారు. తను తప్ప ఇండస్ట్రీలో నాకు అంతగా ఫ్రెండ్స్ లేరని పేర్కొన్నారు. ఎవరినైనా తను నా ఫ్రెండ్ అని చెప్పాలంటే భయం వేస్తుంటుందన్నారు. వాళ్లు గతంలో చేసిన ప్రవర్తనలు గుర్తుకు వచ్చి.. వారికి దూరంగా ఉంటానని అన్నారు. మరికొందరు స్నేహం పేరుతో వాడుకుంటారని చెప్పుకొచ్చారు. అందుకే తనకు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: