తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ బ్యూటి లు గా పేరుపొందారు రష్మిక ,పూజా హెగ్డే. టాలీవుడ్ లో వీరిద్దరు పట్టిందల్లా బంగారంగా మారిపోయింది బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించాయి నప్పటికీ వాటి ప్రభావం పెద్దగా కెరియర్ పైన చూపలేదు. ఇక వీరిద్దరూ ప్రతి సినిమాతో అందం అభినయంతో బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక పూజా హెగ్డే రాధే శ్యామ్, బిస్ట్, ఆచార్య సినిమాలతో వరుస ప్లాపుల ను చవి చూసింది పూజా హెగ్డే అయినా కూడా ఈమె కెరీర్ పై ప్రభావం చూపలేదు.


ప్రస్తుతం పూజా హెగ్డే లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. మహేష్ బాబు తో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ తర్వాత కోలీవుడ్లో కూడా రెండు సినిమాలతో రెడీగా ఉంది. ఇటీవలే జనగణమన సినిమా సైతం అవకాశాన్ని కూడా అందుకుంది. ఇక రష్మిక విషయానికి వస్తే ఈ ఏడాది పుష్ప -2 సినిమాలో నటించడం జరుగుతోంది ఆ తర్వాత విజయ్ 66వ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఆ తరువాత బాలీవుడ్ లో కూడా వరుసగా మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలో నటించింది.ఇంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ భవిష్యత్తులో యువ హీరోయిన్ శ్రీ లీలా నుంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి సందడి సినిమా తో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలా మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా తన డాన్స్ తో కూడా తనేంటో నిరూపించుకుంది. కేవలం ఒక్క చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మకు ఇంతలా పేరు వచ్చింది స్టార్ హీరోలతో నటిస్తే ఇక ఆ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాక చిత్రంలో నటిస్తున్నది. అలాగే కన్నడలో ఒక సినిమా తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: