రాజకీయ వ్యవస్థలోని అవినీతి నాయకులను ఎదిరించే ఒక యువకుడి పాత్రలో సత్యదేవ్ గాడ్సే చిత్రానికి, అలాగే నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ని యాడ్ చేసిన విరాటపర్వం చిత్రానికి రెండింటికీ కూడా దేనికదే ప్రమోషన్స్ లో దూసుకు వచ్చి బజ్ క్రియేట్ చేసుకున్నాయి. అయితే నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు డిఫరెంట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గాడ్సేని చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ మూవీని ఒక సెన్సిబుల్ యాక్షన్ డ్రామాగా చెప్తుంటే.. విరాటపర్వం ఒక ఎమోషనల్ మూవీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదొక వైవిధ్యభరితమైన కథాంశం అందరికీ నచ్చే స్టోరీ అంటూ క్రిటిక్స్ అలాగే విమర్శకులు సైతం విరాటపర్వం చిత్రానికి పాజిటివ్ టాక్ ను ఇస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే గాడ్సే మూవీ బాగుంది.. కానీ అంతకు మించి విరాటపర్వం మూవీ ఉందని ప్రజెంట్ టాక్.
సత్యదేవ్ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుండగా విరాటపర్వం మూవీకి మాత్రం ఓ రేంజ్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆలా చూసుకుంటే ఈ రెండు చిత్రాలలో విరాటపర్వం విన్నర్ గా నిలిచింది. మరి కలెక్షన్ లలోనూ అదే దూకుడు చూపిస్తుందా అన్నది చూడాలి.