దివంగత మహానటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో హాట్ హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కుర్రకారులను పిచ్చెక్కించే అందం ఇంకా అభినయం ఉన్నప్పటికీ కూడా ఈమెకి ఇప్పటి వరుకు బాలీవుడ్ లో ఒక్క సరైన హిట్ రాలేదు..ధఢక్ అనే సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరుకు మొత్తం 8 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..అందులో నాలుగు సినిమాలు విడుదలయ్యి ఘోరమైన ఫలితాలు చూడగా..రెండు సినిమాలు మాత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నాయి..అలాగే మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి..ఇది ఇలా ఉండగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా ఈ నెల 29 వ తేదీనా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక నటన కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లో జాన్వీ కపూర్ కనిపించడం తో..ఈ సినిమా ఆమె కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ లాగ నిలుస్తుందని నమ్మకంతో వుంది జాన్వీ.ఇకపోతే లేటెస్ట్ గా ఆమె సౌత్ ఇండియన్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..


ఇక అసలు విషయానికి వస్తే హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటించిన 'కో..కో..కోకిల' అనే సినిమా తమిళం బాషలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సినిమానే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా..మరో పది రోజుల్లో ఈ సినిమా విడుదలవ్వబోతుండడం తో జాన్వీ కపూర్ ప్రమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుంది..ఈ ప్రమోషన్స్ లో ఆమెని ఎక్కడ చూసిన నయనతార తో పోలుస్తూ ప్రశ్నలు అడగడం తో ఆమె కాస్త అసహనం కి గురైంది. ఇంకా ఆమె మాట్లాడుతూ 'నయనతార గారు సౌత్ ఇండియా లోనే పెద్ద సూపర్ స్టార్..ఆమె అద్భుతమైన నటి..అలాంటి నటితో ఊరికే పోల్చి ఇక నా పరువు తియ్యొద్దు..నన్ను కేవలం నాలాగే చూడండి' అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: