టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాత గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు . కళ్యాణ్ రామ్ ఇప్పటికే అనేక మూవీ లలో  నటించడం మాత్రమే కాకుండా ,  అనేక మూవీ లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా మరియు నిర్మాత గా కళ్యాణ్ రామ్ మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే మూవీ లో హీరోగా నటించాడు.  ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో సంయుక్త మీనన్ , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ లోని సభ్యులు పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ...  త్రీ డీ టెక్నాలజీ తో భారీ ఖర్చుతో తెరకెక్కించిన 'ఓం' సినిమా రిజల్ట్ చూశాక చాలా ఫీల్ అయ్యాను అని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఓం'  మూవీ పై నా లెక్కలు చాలా వరకు తప్పాయి అని,  ఆర్థికంగా నన్ను 'ఓం' మూవీ చాలా దెబ్బతీసింది అని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే పటాస్ మూవీ నష్టాలు అన్నింటినీ రికవర్ చేసింది అని కూడా తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: