మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే ఖిలాడి , రామారావు అండ్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా మాస్ మహారాజా రవితేజ వరస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ 'రావణాసుర' అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీ లో  ఫారియా అబ్దుల్లా , మేఘ ఆకాష్ , అను ఇమాన్యుయల్ ,  దాక్షా నాగర్కర్ ,  పూజిత పొన్నాడ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు , అందులో భాగంగా ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ని తాజాగా మూవీ యూనిట్ ప్రారంభించినట్లు , ఈ క్లైమాక్స్ సన్నివేశాలను అత్యంత స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో తేరకెక్కించే విధంగా చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు ఒక టాక్ బయటకు వచ్చింది.

అలాగే ఈ క్లైమాక్స్ యాక్షన్స్ సన్నివేశాలను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించే విధంగా మూవీ యూనిట్ అన్ని రకాల ప్లానింగ్ లను వేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తో పాటు రవితేజ ప్రస్తుతం ధమాకా మరియు టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: