సీనియర్ నటి నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపుగా అన్ని భాషలలో ఈమె నటించింది తమిళం,కన్నడ,తెలుగు, బాలీవుడ్ వంటి భాషలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఇక నాగార్జునతో వివాహమైన తర్వాత అమల సినిమాలకు పూర్తిగా దూరమైంది అయితే అప్పుడప్పుడు తన ఫ్యాషన్ ని చాటుకుంటూ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా తనకు నచ్చిన రోల్ వస్తే కచ్చితంగా నటిస్తూ ఉంటుంది..తాజాగా యువ హీరో శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం సినిమాలో అమల ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నది.


సినిమా సెప్టెంబర్-9 వ తేదీన థియేటర్ల లలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రచారం పనులు శరవేగంగా చేశారు అమల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఆమె వినయం ఆమె మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి.ప్రచారంలో ఎంతో నిడాబరంగా పాల్గొనడం జరిగింది అమల. ఇక అందుకు తగ్గట్టుగానే నిర్వహకులు నడుచుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది సాధారణంగా సెలబ్రిటీల వెంట సిబ్బంది , మేకప్ ఆర్టిస్టులు ఇక ఆమె బాడీగార్డ్ తదితరులు వెంట వస్తూ ఉంటారు..కానీ అమల విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని చెప్పవచ్చు. చాలా సింపుల్ గా ఎవరూ లేకుండానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఎంట్రీ ఇచ్చి అట్రాక్షన్ గా నిలిచింది.


అన్నపూర్ణ స్టూడియో యొక్క సహా యజమాని అయినప్పటికీ గర్వం లేకుండా కొనసాగడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా కోసం స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఎంతో ఓపికగా ఇస్తూ ఉన్నది ఇక అమల ఎంతో ప్రశాంతంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈమె డౌన్ టు ఎర్త్ అనే పద్ధతిని పాటిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది. స్వయంగా తన వాటర్ బాటిల్ ని ,తన మేకప్ కిట్టిన తాను తెచ్చుకొని అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: