మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఈ సంవత్సరం ప్రారంభం లో రవితేజ , రమేష్ వర్మ దర్శకత్వం లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా తెరకెక్కిన ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు .

అలాగే కొన్ని రోజుల క్రితమే శరత్ మండవ దర్శకత్వంలో దివ్యాంశా కౌశిక్ ,  రాజేష విజయన్ హీరోయిన్ లుగా తరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ప్రస్తుతం కూడా మూడు సినిమా లలో హీరోగా నటిస్తున్నాడు . అలాగే చిరంజీవి హీరోగా తిరక్కెక్కుతున్న ఒక మూవీ లో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో రావణాసుర మూవీ ఒకటి.

మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , ఫారియా అబ్దుల్లా , అను ఇమాన్యుల్ ,  మేఘ ఆకాష్  , పూజిత పన్నోడ ,  ద్రాక్ష నాగర్కర్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.  ఈ క్లైమాక్స్ సన్నివేశాల కోసం మూవీ యూనిట్ ఏకంగా 5 కోట్లతో భారీ సెట్ ని నిర్మించినట్లు ,  ఆ భారీ సెట్ లోనే ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: