నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అదిరి పోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు . ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మాలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోయే మూవీ తర్వాత  మూవీ ని ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... నందమూరి నటసింహం బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే కొరటాల శివ తాజాగా ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యింది. అలాగే మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ,  కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: