సుడిగాలి సుధీర్  హీరోగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ 'గాలోడు'. ఇక రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ గెహనా సిప్పి నటించింది.ఇకపోతే సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ చిత్రంపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.అయితే  ఇప్పటికే 'గాలోడు' నుంచి వచ్చిన టీజర్ తో మంచి ఇంప్రెస్ ను కొట్టేసింది. ఇదిలావుంటే తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను వదిలారు.ఇక గాలోడు ట్రైలర్' సరికొత్తగా ఉంది. 

అంతేకాదు సుడిగాలి సుధీర్  కేరీర్ కు టర్న్ పాయింట్ దొరికినట్టు అనిపిస్తోంది.ఇక  గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సుధీర్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అయితే ట్రైలర్ ను బట్టి.. మాస్ అవతార్ లో దుమ్ములేపుతున్నారు. కాగా డాన్స్, డైలాగ్స్ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొట్టాడు. ఇక మాస్ కుర్రాడు పాత్రలో అలరించబోతున్నాడు.అయితే  చిత్రంలో చాలా షేడ్స్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు  కామెడీ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది.ఇక  బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, లోకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. అయితే మొత్తంగా చిత్రంపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉందని చెప్పొచ్చు.

ఇకపోతే జబర్ధస్త్ కామెడీ షోతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్ .ఇక హిలేరియస్ కామెడీతో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)గా గుర్తింపు పొందాడు. అయితే బుల్లితెరపై సందడి చేస్తూనే.. వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక ఈక్రమంలో చిన్న చిన్న పాత్రలలో అలరించిన సుధీర్.. ప్రస్తుతం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు సుడిగాలి సుధీర్ . అయితే ఇప్పటికే 'సాఫ్ట్ వేర్ సుధీర్','త్రీ మంకీస్' చిత్రాలతో ఆకట్టుకోగా.. ప్రస్తుతం 'గాలోడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కాగా నవంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: