
టాలీవుడ్ నుండి 800 మిలియన్స్ వ్యూస్ వచ్చిన సాంగుగా ఈ పాట నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా 5 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఆదరణ పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు తాజాగా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుని మరొకసారి ట్రెండీగా నిలుస్తోంది ఈ సాంగ్. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ఇక పూజ హెగ్డే కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉన్నది. ఈ ముద్దుగుమ్మ చేతిలో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న ఒక సినిమా బాలీవుడ్లో కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నది.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు హట్ ఫోజులన్ ఇస్తూ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే వస్తూ ఉన్నాయి పూజా హెగ్డే కు. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా డిమాండ్ గానే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్, పూజ హెగ్డే కాంబినేషన్లో మరొక సినిమా రావాలని అభిమానులు సైతం కోరుకుంటూ ఉన్నారు.