'పుష్ప: ది రైజ్' సినిమా దేశావ్యాప్తంగా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్  స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా రష్యా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం .. డిసెంబర్ నెలలో ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది.ఆసక్తికరంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న  ఆ దేశంలో ప్రమోట్ చేయనున్నారు. అయితే చిత్రబృందం నుంచి  అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్ట్ జానర్ లో  వచ్చి మంచి మాస్ హిట్ గా నిలిచింది. సుకుమార్ తనదైన స్టైల్లో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రను తెరపై చాలా బాగా చూపించారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోను పుష్ప బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. 'పుష్ప: ది రైజ్' విడుదలై దాదాపు ఒక ఏడాది అయ్యింది. 


ఇప్పటికీ పుష్ప పాటలు  ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండవ భాగం పుష్ప: ది రూల్ లో పుష్పరాజ్ ఐకానిక్ రోల్ ఇంకెలా మారుతుందో చూడాలన్న ఉత్కంఠ అందరిలో బాగా నెలకొంది.ఈసారి ఈ సినిమా రేంజును అమాంతం పెంచేందుకు సుకుమార్ టీమ్ చాలా ఎక్కువ సమయం తీసుకుని స్క్రిప్టును రీరైట్ చేసింది. అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఛాన్స్ లేని మంచి గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ నేరేషన్ తో పార్ట్ 2 బాగా రక్తి కట్టిస్తుందని సమాచారం తెలుస్తుంది. అయితే జూన్ లో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు షూటింగ్ కొనసాగుతోంది.డిసెంబర్ 2021లో పుష్ప విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ ఫుల్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా దక్షిణాది నుండి వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా  నిలిచింది. ఇక దీనికి వచ్చే ఏడాది సీక్వెల్ విడుదలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: