టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద సాలిడ్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ పెద్ద పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటించి చాలా బాగా అలరించారు. ఇందులో ఎన్టీఆర్ ఎప్పటిలానే తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు రాబోయే మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ఇంతవరకు మొదలవలేదు.ఎన్టీఆర్ నటిస్తున్న 30వ ఇది.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ మూవీ షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు  ప్రకటించారు. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు కొరటాల శివ స్పందించారు. కొరటాల శివ తిరుమలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 30 సినిమా గురించి మాట్లాడారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని.చాలా భారీ ఎత్తున్న ఈ మూవీ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక 2024లో ఏప్రిల్ 5 వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తామని అన్నారు డైరెక్టర్ కొరటాల శివ. దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: