తునివు సినిమా విజయంతో ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు అజిత్ కుమార్. ఇక అజిత్ అభిమానులు తమ హీరో నెక్స్ట్ మూవీ ప్లాన్‌లో మార్పు ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతండటం వలన చాలా అయోమయంలో పడ్డారు.నిజానికి అజిత్ తదుపరి సినిమా  AK 62 కి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఈ సినిమాకు సంబంధించి గతేడాది అధికారిక ప్రకటన కూడా వెలువడింది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేసి దీనికి సంగీతం సమకూర్చడానికి అనిరుధ్‌ను కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఇప్పుడు ఓ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. విఘ్నేష్ స్థానంలో మరొక దర్శకుడిని లైన్ లోకి తీసుకొచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ సినిమాకు అట్లీ లేదా విష్ణువర్ధన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా చాలా జోరుగా ప్రచారం మొదలైంది కానీ తాజా అప్‌డేట్ ఏమిటంటే, మగిజ్ తిరుమేని ఈ సినిమా దర్శకుడిగా ఎంపిక అయ్యాడని సమాచారం టైలుస్తుంది.


గతంలో చాలా సినిమాలతో ఆకట్టుకున్న తిరుమేని చివరిసారిగా ఉదయనిధితో కలగ తలైవన్ సినిమాని రూపొందించారు. త్వరలోనే అజిత్ తో సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్‌డేట్  వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నటీనటులు అలాగే సంగీత దర్శకులు కూడా మారతారని వారి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక తిరుమేని డైరెక్షన్లో తెరకేక్కే సినిమాను మరో ఒకటి రెండు నెలల్లో సెట్స్ మీదకు తీసుకువెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు.అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అజిత్ కుమార్ ఆ తరువాతి సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం తెలుస్తుంది. ఇక విఘ్నేష్ తెరకెక్కించే సినిమా కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం. అయితే అజిత్ మాత్రం ఒక యాక్షన్-ప్యాక్డ్ కథ చెయ్యాలని భావిస్తున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: