సాయి పల్లవి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. అలాగే ఆమె కొత్త సినిమాలను ఒప్పుకోలేదు.. స్టార్ హీరోల చిత్రాల్లో సాయి పల్లవికి ఆఫర్స్ వచ్చాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.ఈ విషయం ఆమె అభిమానులను కొద్దిగా నిరాశకు గురి చేస్తుంది. మరోవైపు సాయి పల్లవి మొత్తంగా సినిమాలు మానేశారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సాయి పల్లవి సినిమాలు మానేశారన్న ఓ వాదన కూడా తెరపైకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

 ఆమె డాక్టర్ గా సెటిల్ కావలనుకుంటున్నారని అలాగే జార్జియా దేశంలో ఎంబిబిఎస్ చదివిన సాయి పల్లవి డాక్టర్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. తన సేవింగ్స్ తో క్లినిక్ ను ఏర్పాటు చేసి డాక్టర్ గా సేవలందించాలని డిసైడ్ అయ్యారని బాగా ప్రచారం జరిగింది. సాయి పల్లవి సినిమాలు మానేయలేదనే క్లారిటీ కూడా వచ్చింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కొత్త చిత్రాలకు ఎందుకు సైన్ చేయడం లేదో కూడా చెప్పారు.

సాయి పల్లవి అంటే మన ఇంట్లో అమ్మాయిగా ప్రేక్షకులు భావిస్తారు. వారు మెచ్చుకునేలా  నా పాత్రలు ఉండాలి. మంచి కధ కోసం ఎదురుచూస్తున్నాను. స్క్రిప్ట్ నచ్చితే ఎలాంటి భాషాబేధం లేకుండా సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి సాయి పల్లవి భవిష్యత్ లో సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే మరింత గొప్ప పాత్రల్లో ఆమెను చూస్తామనే నమ్మకం సాయి పల్లవి మాటలతో వచ్చింది.

జీవితంలో నవ్వులు, ఆశ, కృతజ్ఞత  మనిషికి ఈ మూడు విషయాలు చాలు. హ్యాపీగా లైఫ్ లాగించేయొచ్చని కూడా చెబుతుంది. చాలా అరుదుగా సోషల్ మీడియా పోస్ట్స్ ను పెట్టే సాయి పల్లవి ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో కామెంట్ కూడా చేశారు. అలాగే తన లేటెస్ట్ ఫోటో ను కూడా షేర్ చేశారు. విలువలు కలిగిన హీరోయిన్ గా సాయి పల్లవి మంచి పేరు తెచ్చుకున్నారు. పాత్ర నచ్చకపోతే కోట్లు ఆఫర్ చేసినా కూడా ఆ మూవీ చేయదు సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: