సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో వున్న నెంబర్ వన్ స్టార్ హీరో. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు. నెగటివ్ టాక్ తోనే ఈ సినిమాతో 200 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు మహేష్. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. దాంతో ఈ మూవీ పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట మహేష్ తో త్రివిక్రమ్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడని అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మహేష్‌బాబు కెరియర్‌లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొంచెం యాక్షన్ ఇంకా కొంచెం మాస్ అలాగే కొంచెం పొలిటికల్‌ టచ్‌తో కథ నడుస్తుందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది.


ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే కనిపించనుంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా అలరించనుంది. తాజా అప్‌డేట్‌ ఏంటంటే.. ఈ మూవీలో ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టుగా సమాచారం తెలుస్తోంది. త్రివిక్రమ్ తన మూవీల్లో కీలకమైన పాత్రలని సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌ కోసం ఐశ్వర్యారాయ్‌ని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం తెలుస్తోంది.ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది  మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకునే సినిమా కావడం వల్లనే ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెకండ్ పార్టులో ఆమె విలనిజంపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. మరి సూపర్ స్టార్ మహేశ్ మూవీలో త్రివిక్రమ్ ఆమెను ఎలా చూపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: