సాధారణంగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోలను తమ అభిమానులు ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది అభిమానులు తమ అభిమాన హీరోలను చూడగానే తమ సొంత కుటుంబాల భావిస్తారు. అంతేకాదు కొంతమంది హీరోలను తమ దేవుళ్ళ లాగా కూడా ఆరాధిస్తారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే కచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అజిత్ అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. 

ఇక ఇద్దరు హీరోల సినిమాలో వస్తున్నాయి అంటే చాలు బాక్సాఫీస్ వద్ద జాతర వాతావరణం కనిపిస్తోంది. అంతేకాదు తమ అభిమానులు వాళ్లని దేవుళ్ళలా పూజిస్తూ ఉంటారు. వారి సినిమా బావున్నా లేకపోయినా కూడా వారి సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కావాల్సిందే. అయితే అలాంటి స్టార్ హీరోలు ఇద్దరు కూడా ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని తమ అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమ అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతుందని ఒక ప్రముఖ కోలీవుడ్ మీడియా ఛానల్ నేడు ఒక కథనం ప్రచురించడం జరిగింది.తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ అజిత్ ని కలిసి మల్టీ స్టార్ సినిమా కథని వినిపించారట.

 విన్నానంతరం చాలా బాగుందని చెప్పాడట.. అనంతరం మరి ఈ సినిమాలో మరో హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అని ఆ డైరెక్టర్ని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పారట. ఇక అది వినగానే అజిత్ చాలా సంతోషించాడని కోలీవుడ్లో ప్రస్తుతం ఒక వార్త ప్రచారం అవుతుంది.అంతే కాదు గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక విలేకరి మీకు అజిత్ కి కలిపి సోషల్ మీడియాలో మ్యూచువల్ ఫ్యాన్ వేస్ ఉంది కాబట్టి మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని అందరూ ఆశిస్తున్నారు అని అడిగితే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. మంచి కథతో ఎవరైనా నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ చెప్పాడు. అయితే వీరిద్దరూ ఈ వార్తపై పాజిటివ్ గా స్పందించడంతో నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: