టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. అయితే గత సంవత్సరం డిసెంబర్ నాలుగున తన స్నేహితుడు మరియు ప్రియుడు అయిన సోహెల్ను పెళ్లి చేసుకుంది ఈమె. ఈ నేపథ్యంలోని అసలు సోహెల్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు.. వారిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది వారి పరిచయం.. పెళ్లిదాకా ఎలా వెళ్ళింది అని తన ప్రయాణం గురించి లవ్ షాది డ్రామాలో వివరించింది. ఈ నేపథ్యంలోనే హన్సిక మాట్లాడుతూ.. నేను పెళ్లి గురించి చాలా రహస్యంగా ఉంచాలి అని అనుకున్నాను.. కానీ నాకు తెలియకుండానే నా పెళ్లి గురించి వార్తలు వచ్చాయి..

 ఇక అలా వార్తలు రావడం నాకు ఏమాత్రం నచ్చలేదు.. పైగా నా భర్త సోహెల్ గురించి తన విడాకులకు నేనే కారణం అంటూ చాలా వార్తలు వచ్చాయి.. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.. ఆ సమయంలోనే అమ్మ సలహా మేరకు మా పెళ్లి గురించి నేను అధికారికంగా ప్రకటించాను.. అప్పుడే సోహెల్ నాకు ప్రపోజ్ చేసిన ఒక ఫోటోను నేను నా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాను.. దాంతో అందరూ నాకు విష్ చేయడం మొదలుపెట్టారు.. అప్పుడు నేను కూడా చాలా సంతోషంగా భావించాను.. కానీ అప్పుడే అసలైన సమస్య మొదలైంది.. గతంలో పెళ్లి గురించి అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు..

పెళ్లి గురించి అనౌన్స్ చేసిన అనంతరం నేను షూటింగ్ కోసం చెన్నై వెళ్లడం జరిగింది.. ఆ సమయంలో నేను గతంలో సోహెల్ పెళ్లికి వెళ్లిన కొన్ని ఫోటోలను వైరల్ చేశారు.. దాంతోపాటు నేనే వారి విడాకులకు కారణం అని కూడా అన్నారు.. ఆ విషయం నన్ను ఎంతగానో బాధించింది.. అసలు వారు విడిపోవడానికి కారణం నేను కాదు.. సోయల్ గతం గురించి నాకు ముందు నుండి తెలుసు అని అంది హన్సిక. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈమె. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేయకుండా కంటిన్యూ చేస్తోంది హన్సిక.ప్రస్తుతం హన్సిక మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: